Authorization
Mon March 17, 2025 10:07:04 pm
నవతెలంగాణ-అడిక్మెట్
గాంధీనగర్ డివిజన్లోని ఉల్లిగడ్డ బస్తీ పరిసర ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, లొప్రెషర్ సమస్యను పరిష్కరించామని గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక బస్తీ ప్రజల ఫిర్యాదు మేరకు జలమండలి అధికారులకు సమస్యను వివరించి 6'' ఇంచ్ మంచినీటి పైప్ లైన్ సప్లరు సమయంలో స్వల్ప మార్పులు చేసి, లోప్రెజర్ సమస్య నివారణకు పలు క్రమబద్దీకరణ చర్యలు చేపట్టినట్టు వాటర్ వర్క్స్ మేనేజర్ కృష్ణ మోహన్ కార్పొరేటర్ పావని పర్యవేక్షించి సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర యువ నాయకులు ఎ.వినరు కుమార్, డివిజన్ అధ్యక్షులు రత్న సాయి చంద్, సత్తిరెడ్డి, నర్సింహ, శ్రీనివాస్, అరుణ్ కుమార్, అధికారులు ఇర్క్ ఇన్స్పెక్టర్ శంకర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.