Authorization
Sun March 16, 2025 01:30:27 pm
నవతెలంగాణ-హయత్నగర్
హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి డివిజన్లోని తిరుమల కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ పనులను కాలనీవాసులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న మంచినీటి పైప్లైన్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కాలనీ అధ్యక్షుడు వీరస్వామి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, వాటర్ వర్క్స్ మేనేజర్ రాజు, సూపర్వైజర్ బాలు, డివిజన్ ప్రధాన కార్యదర్శి సంఘీ, అశోక్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.