Authorization
Sun March 16, 2025 11:05:21 am
నవతెలంగాణ-ఓయూ
ఏఐఎస్ఎఫ్ పీడీఎస్‌యూ (విజృంభన) ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో ఉన్న సర్ రోజ్ మసూద్ సెమినార్ హాల్‌కు మరమ్మతులు చేపట్టి నవీనీకరించాలని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.చింత గణేష్‌కి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పీడీఎస్‌యూ (విజృంభన) నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక అంశాలపై చర్చలు, సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించుకుని వాటిని అధ్యయనం చేసి అవగాహనపర్చుకుని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఆర్ట్స్ కళాశాలలోని సర్ రోజ్ మసూద్ సెమినార్ హాల్లో సదస్సులు నిర్వహించుకునే క్రమంలో సరైన సదుపాయాల్లేక హాలు ప్రతిధ్వనించడం జరుగుతుందన్నారు. దీని వల్ల సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలంటే అంతరాయం ఏర్పడుతుందనీ, హాల్‌కు మరమ్మతులు చేయించి సదస్సులు నిర్వహించుకోవడానికి అంతరాయం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య, పీడీఎస్‌యూ (విజృంభన) ఓయూ కన్వీనర్ బొడ్డుపల్లి అఖిల్, ఏఐఎస్ఎఫ్ ఓయూ సహాయ కార్యదర్శి ఉప్పల ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులు ఇరిగి బాలరాజు, లక్ష్మణ్ పాల్గొన్నారు.