Authorization
Sun March 16, 2025 07:46:53 am
నవతెలంగాణ-హయత్‌నగర్
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈ రెడ్డి గార్డెన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సతీమణి దేవిరెడ్డి కమలా సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నియోజకవర్గ స్థాయి మహిళలతో నిర్వహిం చారు. మొత్తం 11 డివిజన్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ మహిళా అధ్యక్షులతో భారీ ఎత్తున సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సాయి శ్రీ, మన్సురాబాద్ డివిజన్ అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.