Authorization
Thu April 03, 2025 12:17:13 pm
నవతెలంగాణ-ఓయూ
హబ్సిగూడ మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంలో ఆర్టిఫ్రీ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శను ఘనంగా నిర్వహించారు. ఈషో ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్నట్టు షోరూం హెడ్ మహమ్మద్ అహ్మద్ సోఫీ తెలిపారు. ఈ ఆర్టిఫ్రీ బ్రాండెడ్ జ్యువలరీ షో విశిష్ఠ ఆభరణాల ప్రదర్శన. ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు, జాతి రతాభరణాలను ప్రదర్శిస్తున్నారు. ఈ ఆభరణాలు అద్వితీయమైన కళానైపుణతతో అంతులేని హుందాతనంతో కూడినవి. నగిషీ చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాకృతికి నిదర్శనంగా నిలుస్తుందని సోఫీ తెలిపారు. ఈ షోకు ముఖ్య అతిథులుగా వినియోగదారులు, శ్రేయోభిలాషులు, ఈ ఆర్టిఫ్రీ మలబార్ గోల్డ్ డైమండ్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఆర్టిఫ్రీ షోలో ప్రతేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వారి బ్రాండుల సమాహారం ''మైన్'' ధ్రువీకరించిన వజ్రాభరణాలు, వివాహం, పార్టీ సంబరాల కోసం, ''ఎరా'' అన్‌కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ఠ శ్రేణి, 'ప్రెష్యా జాతిరతాభరణాల సముదాయం. ''ఎతిక్స్ హస్తకళా నైపుణతతో తయారైన ఆభరణాలు, 'జోల్' అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటాయి. ''డివైన్'' భారతీయ ప్రాచీన సంప్రదాయం వర్గం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం ''స్టార్లెట్'' పిల్లల ఆభరణాలు సమకూర్చారు. 22 కారెట్ల పాత బంగారం మారిణి పై 0 శాతం తగ్గింపును పొందవచ్చునని తెలిపారు. వారి ముప్పై ఏళ్ళ వేడుకల్లో భాగంగా ప్రతి రూ.30వేల కొనుగోలుతో 100 మిల్లీ గ్రాముల బంగారు నాణేనికి సమానమైన విలువను పొందగలరని తెలిపారు. డైమండ్, జెమ్పోన్ అండ్ పోల్కిడిజైన ఆభరణాల కొనుగోలు పై 250 మిల్లీ గ్రాముల బంగారు నాణానికి సమానమైన విలువను పొందవచ్చునని తెలిపారు. ఈ ఆఫర్ ఈ నెల 30వ తేదీ వరకు వర్తిస్తుంది. ఈ సందర్భంగా షోరూం హెడ్ సోఫీ మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్ననమకమైన జులరీ బ్రాండ్, మలబార్ గ్రూప్‌కి సంబంధించిన మూలమైన సంస్థ. ఈ సంస్థ తను వార్షిక ఆదాయంలో నుంచి గణనీయమైన వాటిని సామజిక సంస్థాగత బాధ్యత రూపంలో ఆరోగం, ఉచిత విద్యనిరుపేదలకు గృహ నిర్మాణం, మహిళా సాధికారిత, ఇంకా పర్యావరణ రక్షణ విభాగాల్లో తమవంతు సాయం అందిస్తుందని చెప్పారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆభరణాల విక్రయ వ్యాపారంలో ఒక ప్రత్యేకత ఏర్పచుకుంటూ ఇండియా, సింగపూర్, జీసీసీ, యూ.ఎస్.ఎ దేశాల్లో 300 కి పైగా షోరూములతో విస్తరించుకుని ముందుకు సాగుతుంది అని స్టోర్ హెడ్ మొహమద్ అహద్ సోఫీ తెలిపారు.