Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్
నవతెలంగాణ-ధూల్‌పేట్
ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు లబ్ది చేకూరే విధంగా నిర్మించి పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) సౌత్ జిల్లా చాంద్రాయణగుట్ట జోన్ కమిటీ ఆధ్వ ర్యంలో ఇండ్ల సాధన సదస్సు చాంద్రాయణగుట్టలోని గౌస్‌నగర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో లక్ష ఇండ్లు నిర్మించి పేదలకు, అర్హులైన వారికి లబ్ది చేకూరే విధంగా పంపిణీ చేస్తామన్నారన్నారు. ఇప్పటికె కొన్నేండ్లు గడిచి పోయినా డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ మాత్రం జరగలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు వస్తాయని కోటి ఆశాలతో పేద ప్రజలు వేచి చూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాని పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే నిర్మాణం పూర్తయినా డబుల్ ఇండ్లు అర్హులైన స్థానిక పేదలకు గుర్తించి కేటా యించాలని డిమాండ్ చేశారు. గౌస్‌నగర్‌లో ఇప్పటికే పూర్తయిన ఇండ్లు ఉన్నాయనీ, వాటిని అక్కడ నివసించే పేదలకు పంపిణీ చేయాలన్నారు. చాలా మంది ఇండ్లు లేని వారు కిరాయి ఇండ్లలో నివసిస్తూ అద్దెలు చెల్లించలేని స్థితిలో ఉన్నారనీ, వారికి స్థానికత ఆధారంగా గుర్తించి ఇండ్లు లేని నిజమైన పేదకు ఇండ్లు ఇవ్వాలనీ, లేని పక్షంలో పేదలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎస్.కిషన్, కృష్ణ, స్వామి, జీవన్, శ్రీను, మీరాజ్, అశ్మ, పర్వీన్, ఎండీ గౌస్, రషీద్ పాల్గొన్నారు.