Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ
తెలంగాణ-ముషీరాబాద్
గౌడ జనాభా దామాషా ప్రకారం పార్లమెంటు స్థానాలు కేటాయించాలనీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలో గౌడ సామాజికవర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక పొందుపర్చాలని తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా గాంధీభవన్‌లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిక్కడపల్లిలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైన్సులు, బార్లు 50 శాతం గౌడ సామాజిక వర్గానికి కేటాయించాలన్నారు. కలుగీత కార్పొరేషన్‌కు రూ.5వేల కోట్లు కేటాయించి విధి విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడ్డ జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మెన్ బాలగౌని బాలరాజు గౌడ్, కన్వీనర్ ఐలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మెన్ వెలికట్టె విజరు కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.