Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ
నవతెలంగాణ-బంజారాహిల్స్
కార్మికుల ఆత్మబంధువు నారాయణస్వామి అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముం దుగా ఆయన వలస జననేస్తం తెలుగు పుస్తకాన్ని సీనియర్ పాత్రికేయులు డాక్టర్ పజల్లుల్లా ఖాన్ ఆంగ్లంలో అనువా దించిన ''ద అన్ స్పోకెన్ లీడర్'' పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 86 శాతం అసంఘటిత కార్మికులు భారతదేశంలో ఉన్నారన్నారు. నైపుణ్యత ఉంటే కార్మికులు రనించవచ్చునీ సీనియర్ పాత్రికేయులు పూలూరి నారాయణ స్వామి లాగే అంకిత భావంతో పని చేయలని సూచించారు. తాను కేంద్రమంత్రిగా కార్మికశాఖ మంత్రిగా చేయడంతో తన జీవితం ధన్యమైంన్నారు. రాష్ట్రంలో 15 లక్షలు వలస కార్మికులు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా 15 లక్షల వరకు ఉన్నారనీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల మంది కార్మికులు వివిధ దేశాల్లో పని చేస్తున్నారని తెలిపారు. కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిందనీ, ముఖ్యంగా పెన్షన్, ఆరోగ్య సంరక్షణ బీమా సదుపాయాలు ఏర్పాటు చేసిందన్నారు. కార్మికుల నిధులు, ఇతర సంక్షేమ పథకా లకు వినియోగించి దుర్వినియోగం చేయడం మంచిది కాదని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. నారాయణ స్వామి కుమారులు కిరణ్ భార్గవ్ మాట్లాడుతూ ఈ పుస్త కాన్ని ఆంగ్లంలో రచించడం వల్ల తన తండ్రి సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నారు. తాను ఆ సేవను ముందుకు కొనసాగించే ప్రయత్నం చేస్తానని తెలి పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ మీడియా సంఘం మాజీ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి, సీనియర్ పాత్రికే యులు దిలీప్ రెడ్డి, కల్యాణ్, మై గ్రాంట్స్ రైటర్స్ కౌన్సిలింగ్ ప్రధాన కార్యదర్శి ఎండి ఎలియాస్, న్యాయవాది శశి కిరణ్, పాలమూరు మైగ్రౌంట్స్ లేబర్ యూనియన్ సెక్రెటరీ అబ్రహం, ఎండి సలీం, షోయబుల్, రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.