Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం 'చెప్పాలని ఉంది'. ఒక మాతృభాష కథ అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రలలో అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు.
తాజాగా ఈ చిత్రం నుంచి 'నీ కోసం..' అంటూ సాగే పాట విడుదలైంది. అస్లాం కీ ఈ పాటని హార్ట్ టచింగ్ మెలోడిగా స్వరపరిచారు. కాశ్మీర్ మంచు కొండల్లో విజువల్ వండర్‌గా చిత్రీకరించిన ఈ పాట విన్న వెంటనే మనసుని హత్తుకుంటుంది. పాటలోయష్ పూరి, స్టెఫీ పటేల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ప్రేమికుల ఎడబాటుని కృష్ణ చైతన్య అందించిన సాహిత్యం హృద్యంగా ఆవిష్కరించింది. గాయకుడు హరిచరణ్ తన వాయిస్‌తో మెస్మరైజ్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 9న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.