Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.
రవితేజ, విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జ్వాలా గుత్తా చిత్రంలోని 'చల్ చక్కని చిలక' పాటకు వేదికపై డ్యాన్స్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది.
రవితేజ మాట్లాడుతూ, 'ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. జస్టిన్ ప్రభాకరన్ సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం. తనతో సినిమా కూడా చేయాలని విష్ణుతో చెప్పాను. రిచర్డ్స్ వండర్ ఫుల్ కెమరామెన్. దర్శకుడు చెల్లా అయ్యావు కథ చెప్పినపుడు చాలా ఎంజాయ్ చేశాను. తన సెన్స్ ఆఫ్ హ్యుమర్ బావుంటుంది. తనతో ఓ సినిమా మాత్రం చేయాలి. అందం, ప్రతిభ కలిపితే ఐశ్వర్య లక్ష్మీ. ఇందులో ఆమె పాత్రని ఖచ్చితంగా ఎంజారు చేస్తారు. విశాల్, ఐశ్వర్య కెమిస్ట్రీ స్టన్నింగ్‌గా ఉంటుంది. ఇది కేవలం స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు. ఎమోషన్, ఫ్యామిలీ, లవ్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి' అని చెప్పారు.
నాయిక ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ, 'ఇలాంటి చక్కని సినిమాని నిర్మించిన రవితేజ, విష్ణు విశాల్‌కి కృతజ్ఞతలు. మీ ఫ్యామిలీ అందరికీతో కలిసి థియేటర్లో మా చిత్రాన్ని చూసి ఎంజారు చేయండి' అని తెలిపారు.
'రవితేజ 'మట్టి కుస్తీ'ని నిర్మించడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఆయనకి తమిళనాడులో కూడా భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. ఆయన త్వరలో తమిళ్లో సినిమా చేయాలి. విష్ణు విశాల్, ఐశ్వర్య అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేశారు. ఫ్యామిలీతో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది' అని దర్శకుడు చెల్లా అయ్యావు అన్నారు. జ్వాలాగుత్తా మట్లాడుతూ, 'ఈ సినిమా మంచి కంటెంట్‌తో రూపొందింది. విష్ణు విశాల్ ఎంచుకునే కథలు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ సినిమాలో ఆయన నటన మీద అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యలక్ష్మీ కాంబోలో వచ్చే సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తారు. విష్ణుని నమ్మి ఈచిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చిన రవితేజకి థ్యాంక్స్' అని చెప్పారు.
రవితేజ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయనది చాలా మంచి మనసు. ఒక్క మీటింగ్‌లోనే నాపై పూర్తి నమ్మకం ఉంచారు. జ్వాలా నన్ను తెలుగు సినిమాలు చేయాలని చెప్పేది. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్‌ని ప్రేమిస్తారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఆడ, మగ సమానమనే సందేశాన్ని చాటే సినిమా ఇది. మహిళా ప్రేక్షకులు సినిమాని చాలా ఇష్టపడతారు.
- హీరో విష్ణు విశాల్