Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హిట్ ది ఫస్ట్ కేస్' క్రైమ్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసి టైటిల్‌కు తగ్గట్టే హిట్ సాధించారు శైలేష్ కొలను. ఇప్పుడు ఆయన 'హిట్ యూనివర్స్'ని రూపొందించారు. అందులో భాగంగా హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందిన మరో చిత్రం 'హిట్ 2 ది సెకండ్ కేస్'.
ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శైలేష్ కొలను మీడియాతో మాట్లాడుతూ, 'శేష్ ఓ ఆఫీసర్‌గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఇందులో కాస్త వెటకారం కూడా జోడించాను. ఆయన్ని కొత్తగా కనిపిస్తారు. ఒక్కో ఆఫీసర్‌ను పరిచయం చేస్తూ.. చివరకు అందరూ ఆఫీసర్లను కలిపేద్దామని ఫిక్స్ అయ్యాను. అవెంజర్స్‌లా రాసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. 'హిట్ 2'లో చాలా ట్విస్టులుంటాయి. హిట్ ఫస్ట్ కేస్ సమయంలో దిశ ఘటన జరిగింది... సెకండ్ కేస్ సమయంలో మళ్లీ ఇలాంటి (శ్రద్దా వాకర్) ఓ ఘటన జరిగింది. అలాంటి క్రిమినల్స్ సమాజంలో ఉన్నారు. వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలనే ఆలోచన జనాలకు వచ్చినా నాకు సంతోషమే. క్రిమినల్స్ ఎందుకు ఇలా మారుతారు? అనే చర్చ ఈ సినిమాలో ఉంటుంది. ఇది కరెక్ట్.. ఇది తప్పు అని మాత్రం నేను చెప్పలేదు. ఆడియెన్సే ఆ సీన్లోని తప్పేంటి? రైట్ ఏంటి? అన్నది తెలుసుకుంటారు. కోడి బుర్ర అనేది నా ఊత పదం. అదే డైలాగ్‌ను ఇందులో పెట్టాం. అది హీరో కావాలని అన్నాడా? ఎందుకు అన్నాడు? అనే విషయం సినిమా చూస్తే తెలుస్తుంది. లవ్ స్టోరీ కూడా కావాలని పెట్టింది కాదు. ఓ కేసును పోలీస్ ఆఫీసర్ టేకప్ చేస్తే ఆయన పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతారు? అనేది కూడా చూపించాం. థ్రిల్లర్ జోనరే అయినా కూడా ఫ్యామిలీ అంతా కనెక్ట్ అయ్యేలా కథను రెడీ చేశాను' అని చెప్పారు.