Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత టైటిల్ పాత్రలో హరి, హరీష్ దర్శకులుగా శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా 'యశోద'. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.హొ ఈ సినిమాలో 'ఈవా' పేరు ఉపయోగించడంతో హైదరాబాద్లో 'ఈవా ఐవీఎఫ్' ఆసుపత్రి వర్గాలు కోర్టుకు వెళ్ళాయి. వాళ్ళతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారించారు. సినిమాలో 'ఈవా' పేరును తొలగించినట్టు పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కావడంతో 'ఈవా ఐవీఎఫ్' ఎండీ మోహన్ రావుతోహొకలిసి మంగళవారం ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు.హొ హొ
ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, 'ఒకరినిహొబాధ పెట్టే ఉద్దేశం గానీ, ఇతరుల మనోభావాలను కించపరిచే ఆలోచన గానీ మాకు అసలు లేదు. అందుకని, వెంటనే 'ఈవా ఐవీఎఫ్' ఆసుపత్రి వర్గాలనుహొసంప్రదించాను. భవిష్యత్తులో 'యశోద' సినిమాలో ఎక్కడా 'ఈవా' పేరు కనిపించదు' అని తెలిపారు. 'ఈవా ఐవీఎఫ్' ఎండీ మోహన్ రావు మాట్లాడుతూ, ''యశోద'లో మా ఆసుపత్రి పేరు ఉపయోగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాను. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మమ్మల్ని సంప్రదించారు. కోర్టు ద్వారా మేం వ్యక్తం చేసిన అభ్యంతరాల పట్ల మాతో మాట్లాడారు. ఈవా పేరు తొలగిస్తామని చెప్పారు' అని అన్నారు.