Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'ముఖచిత్రం'. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. 'కలర్ ఫొటో' సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ, 'ఈ సినిమా చిన్న చిత్రంగా మొదలైంది. కానీ విశ్వక్ సేన్ మా టీమ్‌లోకి వచ్చాక పెద్ద సినిమా అయ్యింది. టీజర్ కట్ చేసి ఆయనకు చూపించినప్పుడు నా పాత్ర ఏంటి అని కూడా అడగకుండా ఈ సినిమా నేను చేస్తాను మీరు షూటింగ్ డేట్ ఫిక్స్ చేసుకోండి అన్నారు. ఒక చిన్న సినిమాకు సపోర్ట్ చేసిన ఆయనకు థ్యాంక్స్. ఈ క్యారెక్టర్ ఆయన ఎందుకు చేశాడు అనేది రేపు థియేటర్లలో చూసినప్పుడు అర్థమవుతుంది' అని అన్నారు. 'ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది' అని సంగీత దర్శకుడు కాలభైరవ చెప్పారు. ఎస్కేఎన్ మాట్లాడుతూ, 'అనేక లేయర్స్ ఉన్న మల్టీ జోనర్ మూవీ ఇది. కథ ఇలా ఉంటుందేమో అనుకునేలోపు మరో టర్న్ తీసుకుంటుంది. ప్రేక్షకుల ఊహకు అందకుండా సాగుతుంది. ఇలాంటి థ్రిల్లర్స్‌ను ఇప్పుడు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఒక డిఫరెంట్ మూవీగా ఆకట్టుకుంటుంది' అని చెప్పారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ, 'మంచి వాయిస్ ఉన్న క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను. మూవీ కంటెంట్ కొంత చూసినప్పుడు ఈ చిత్రంలో పార్ట్ అవ్వాలనిపించింది. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది' అని అన్నారు.