Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ పక్క విస్తృతమైన రాజకీయ పర్యటనలు.. మరో పక్క సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్న పవన్‌కళ్యాణ్ లేటెస్ట్గా ఓ కొత్త చిత్రానికి గ్రీన్‌సిగల్ ఇచ్చారు. 'సాహో' దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఈచిత్రాన్ని భారీ స్థాయిలో డి.వి.వి. దానయ్య తన డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఆదివారం అధికారికంగా ఎనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా రిలీజ్ చేసిన పోస్టర్ అందరిలోనూ అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ పోస్టర్లో ఉన్న 'ఫైర్ స్ట్రోమ్ ఈజ్ కమింగ్' అనే వ్యాఖ్య అందరిలోనూ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అలాగే పోస్టర్‌పై దే కాల్ హిట్ ఓజీ అని కూడా రాసి ఉంది.
అలాగే జపనీస్ భాషలోనూ 'ఫైర్ స్ట్రోమ్ ఈజ్ కమింగ్' అనేది రాశారు. పోస్టర్ ఆధారంగా ఇదొక గ్యాంగ్‌స్టర్ మూవీ అని అర్థమవుతోంది. పవన్‌కళ్యాణ్ కొత్త సినిమాకి పచ్చజెండా ఊపారంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఇది ఎనౌన్స్మెంట్ రోజునే భారీ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి రవి.కె.చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే, పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' చిత్రంలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తోంది. అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన భారీ సెట్లో ఈ సినిమా షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. పవన్‌కళ్యాణ్‌తోపాటు దాదాపు 900 మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. అలాగే హరీశ్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ 'భవదీయుడు భగత్‌సింగ్' అనే చిత్రంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.