Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పరారీ' మూవీ పోస్టర్‌ను ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి ఆవిష్కరించారు. చిత్ర టీజర్‌ను ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ రిలీజ్ చేశారు. శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ పై గాలి ప్రత్యూష సమర్పణలో యోగేశ్వర్, అతిథి జంటగా ఈ సినిమా రూపొందుతోంది. సాయి శివాజీ దర్శకత్వంలో జివివి గిరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్లో ఈ చిత్ర పోస్టర్, సెకెండ్ టీజర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్మాత జి వి వి గిరి మాట్లాడుతూ,'చక్రి తమ్ముడు మహిత్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇందులో సుమన్ మంచి క్యారెక్టర్ చేశారు. అలీ, షయాజి షిండే, మకరంద్ దేశ ముఖ్ కీలక పాత్రల్లో నటించారు. మంచి కథ, కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుంది' అని అన్నారు 'హీరో యోగేశ్వర్ అనుభవం ఉన్న ఆర్టిస్టులా నటించాడు. సినిమాలో పాటలు అన్ని బాగా వచ్చాయి. ఈ సినిమాతో నాకు మంచి పేరు వస్తుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలి' అని సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ చెప్పారు.