Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంద్ర, కోమల్ నాయర్, దీపు, స్వాతి శర్మ, ఇమ్రాన్, సీతల్ బట్ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు'. యు.మేఘనాథ్, ఎం.లోకేష్ కుమార్ సమర్పణలో లోల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లక్ష్మణ్ జెల్ల దర్శకత్వంలో చంద్రాస్ చంద్ర, డాక్టర్ విజయ రమేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న సందర్భంగా మేకర్స్ మోషన్ లోగోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
ఈ వేడుకకి ఏ.పి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, తెలంగాణ ఎఫ్.డి.సి.ఛైర్మెన్ అనిల్ కుర్మాచలం, టి.యఫ్. పి. సి చైర్మన్ ప్రతాని రామకష్ణ గౌడ్, డైరెక్టర్ రాజు యాదవ్, సీనియర్ నటి జయలక్ష్మి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని, చిత్ర మోషన్ లోగోను లాంచ్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ, 'స్నేహాన్ని కొత్తగా, గొప్పగా చెప్పాలని ఈ సినిమా తీశాం. ప్రేమకు ఉన్న విలువలు, స్నేహానికి ఉన్న గొప్పతనం రెండింటిని బ్యాలెన్స్ చేసి ఈ సినిమాలో చూపించాం. యూత్‌కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది' అని తెలిపారు. 'లవ్‌లో బ్రేకప్స్ చూశాం. కానీ ఫ్రెండ్షిప్లో చూడలేదు. ప్రతి మనిషి జీవితంలో లవ్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, ఫ్రెండ్షిప్కు అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలనే తెలియజేసే చిత్రమిది. వాస్తవ జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ను కథగా రాసుకున్నాను. ఈ కథ కచ్చితంగా ట్రెండ్‌ను సెట్ చేస్తుందనే నమ్మకం ఉంది' అని దర్శకుడు లక్ష్మణ్ జెల్ల చెప్పారు.