Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అలాంటి నిర్మాతని విస్మరించి రాజమౌళి టీమ్ ఆస్కార్ ప్రమోషన్ల పర్వాన్ని నిర్వహించింది. అంతేకాదు ఆస్కార్ వేదికపై ఆయన ఊసే లేకుండా రాజమౌళి, రాజమౌళి కొడుకు కార్తీకేయ గురించి కీరవాణి ఆకాశానికెత్తేశాడు. ఇక హీరోలు మాత్రం తక్కువ అన్నట్టు.. వీళ్ళు కూడా పెయిడ్ పబ్లిసిటీ ప్రమోషన్లలో రాజమౌళి గొప్పతనం గురించి, కీరవాణి సామర్ధ్యం గురించి చెప్పిందే చెప్పారు తప్ప.. అసలు ఇంత భారీ ప్రాజెక్ట్‌కి కారణమైన నిర్మాత గురించి చెప్పకపోవడం గమనార్హం. దీంతో పాపం.. దానయ్య అంటూ సోషల్ మీడియాలో ఆయనపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఎందుకు వీళ్ళు నిర్మాత గురించి చెప్పలేదనే కోణాన్ని పరిశీలిస్తే, ఆస్కార్ ప్రమోషన్ల కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని రాజమౌళి బృందం దానయ్యకి చెబితే, నా వల్ల కాదు.. అని ఆయన ఇచ్చిన సమాధానమే ఆయన పేరుని ఎవైడ్ చేయటానికి కారణమని తెలిసింది. అయితే ఇదే ఆస్కార్ వేదికపై ఆస్కార్ అందుకున్న ప్రతి విజేత తమ నిర్మాత గురించి సగర్వంగా చెప్పుకున్నారు.
దీనికి కూడా ప్రత్యక్ష ఉదాహరణ తనని, తన కథని నిర్మాత నమ్మబట్టే ఈ వేదికపై ప్రతిష్టాత్మక ఆస్కార్‌ని అందుకున్నానని నిర్మాత గునీత్ మోగ గురించి దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్ గొప్పగా చెప్పింది. ఈపాటి విజ్ఞత కీరవాణికి ఎందుకు కొరవడింది?