Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విగన్ క్రియేషన్స్ సమర్పణలో విజయ్, శీతల్ బట్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'విల్లా 369'.
సురేష్ ప్రభు దర్శకత్వంలో విద్య గణేష్ నిర్మాతగా, డా.రాకేష్ సహ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు తేజ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'దర్శకుడు సురేష్ ప్రభు మంచి సబ్జెక్ట్‌తో ఈ సినిమా నిర్మాతలకు మంచి విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని చెప్పారు. నిర్మాత విద్య గణేష్ మాట్లాడుతూ,'ఈ చిత్రానికి దర్శకుడు మంచి నటీ నటులను సెలెక్ట్ చేసుకున్నాడు. డి. ఓ. పి ర్యాడీ రఫీ కెమెరా పనితనం, సంగీత దర్శకుడు మహావీర్ అద్భుతమైన మ్యూజిక్ సినిమాకి హైలెట్స్ అవుతాయి. ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం' అని అన్నారు.
'ఇలాంటి మంచి కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా అనుకున్న విధంగా చాలా బాగా వచ్చింది' అని చిత్ర దర్శకుడు సురేష్ ప్రభు అన్నారు. రవి వర్మ, జ్యోతి, చిత్రం శ్రీను, శివారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : చిత్రం శ్రీను, లక్ష్మణ్ బాబు.