Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'దసరా'లో ఆ సన్నివేశాన్ని తొలగించి.. క్షమాపణలు చెప్పాలి
'అంగన్వాడీ టీచర్లను, కార్యకర్తలను దొంగలుగా చిత్రీకరించి అవమానిస్తారా..?, ఈ రకమైన సన్నివేశాలను 'దసరా' సినిమా నుంచి తొలగించాలి. లేకపోతే ఆందోళలను మరింత ఉధృతం చేస్తాం' అని 'దసరా' చిత్ర బృందంపై ఆదిలాబాద్‌లో అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ ఎదుట నిరసన చేపట్టారు. 'దసరా' సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల అనే పాత్రను పోషించారు. అంగన్ వాడీ టీచర్‌గా నటించారు. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో ఆమె స్కూల్లోని కోడిగుడ్లను దొంగతనం చేసి అమ్ముకుంటున్నట్టు, ఆ గుడ్లను తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టు చిత్రీకరించారు. ఈ సన్నివేశంపై అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని థియేటర్ వద్ద ధర్నా చేశారు. ఆ సీన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు చిత్ర బృందం క్షమాపణలు చెప్పాలన్నారు. సన్నివేశాన్ని తొలగించకపోతే సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్స్ వద్ద నిరసనకు దిగుతామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ హెచ్చరించారు. కోడిగుడ్లను, కూరగాయలను దొంగతనం చేసే దొంగలుగా అంగన్వాడీలను చిత్రీకరించారు. ఇది సమాజంలో అంగన్వాడీల ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ సినిమాలో ఉంది. తెలంగాణ అంగన్వాడీలను, హెల్పర్స్ను అవమాన పరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలి. లేనిపక్షంలో తమ నిరసనని మరింత ఉధృతం చేస్తామని కిరణ్ చెప్పారు.