Authorization
Sun April 06, 2025 03:00:28 pm
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన చిత్రం 'మీటర్'. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్ టైన్మెంట్ నిర్మించింది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు తెరకెక్కించిన ఈ చిత్రంలో అతుల్య రవి కథానాయిక. సమ్మర్ స్పెషల్‌గా ఈనెల 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన ప్రీ రిలీజ్లో హీరో మాట్లాడుతూ, 'దర్శకుడు రమేష్ నన్ను చాలా డిఫరెంట్‌గా చూపించారు. మాస్ కమర్షియల్ ఆడియెన్‌కి ఎలాంటి ఎలిమెంట్స్‌తో కథ కావాలో అవన్నీ ఇందులో ప్రజంట్ చేశారు. సినిమా హై వోల్టేజ్ ఎనర్జీటిక్ ఎంటర్టైనర్గా ఉంటుంది. విజిల్స్ కొట్టి, గోల చేసి థియేటర్‌కి వెళ్లి ఎంజారు చేసే సినిమా' అని తెలిపారు.