Authorization
Sun April 06, 2025 12:29:56 pm
యాక్టర్, డైరెక్టర్ రవిబాబు తాజాగా రూపొందించిన మిస్టరీ థ్రిల్లర్ 'అసలు'. ఈటీవీ విన్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రవిబాబు కీలక పాత్రలో నటిస్తూ, నిర్మించిన సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. పూర్ణ మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించగా, రవిబాబు స్వయంగా కథ అందించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆద్యంతం క్యురియాసిటీని పెంచింది. ప్రొఫెసర్ చక్రవర్తిని ఎవరో దారుణంగా హత్య చేయడం, ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి పవర్ ఫుల్ కాప్‌గా రవిబాబు రంగంలోకి దిగడం, ఈ కేసులో నలుగురు అనుమానితులు, నాలుగు రహస్యాలు, ఒక ఆశ్చర్యకరమైన నిజం, చివరికి హంతకుడు ఎవరు?.. ఇలా ఆసక్తికరమైన ప్రశ్నలు రేకెత్తిస్తూ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా సాగింది. రవిబాబు మరో యూనిక్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ని చూపించబోతున్నారని ట్రైలర్ చెప్పకనే చెప్పింది.
సూర్య కుమార్, భగవాన్ దాస్, సత్య కృష్ణన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, నిర్మాత: రవిబాబు, దర్శకత్వం: ఉదయ్, సురేష్, సంగీతం: ఎస్ఎస్ రాజేష్, డీవోపీ: చరణ్ మాధవనేని.