Authorization
Fri April 04, 2025 08:36:18 am
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత మనోబాల (69) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత రెండు వారాలుగా కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన బుధవారం కన్నుమూశారు. 35 ఏండ్ల సినీ ప్రస్ధానంలో ఆయన 450కిపైగా చిత్రాల్లో నటించారు. అలాగే పలు సీరియల్స్‌లోనూ నటించి మెప్పించారు. మనోబాలకు భార్య ఉష, కుమారుడు హరీష్ ఉన్నారు. భారతీరాజా 'పుతియ వర్పుగల్'తో కెరీర్‌ను ప్రారంభించిన ఆయన ఇటీవల విడుదలైన చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లోనూ కనిపించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మనోబాల మృతిపట్ల కమల్‌హాసన్, రజనీకాంత్ వంటి ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.