Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో, కుటుంబాలలో జరుగుతున్న అనుమానాస్పదమైన సమస్యలను, మంచి చెడులను ఎత్తి చూపిస్తూ ఆ సమస్యలను ఎలా అరికట్టాలి అనే దాని పై చిత్రీకరిస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం 'అయ్యో పాపం'. బాలా క్రియేషన్స్ పతాకంపై రజినీ కుమార్, జీవన్ కుమార్ సపాన్స్ హీరో, హీరోయిన్స్‌గా, దర్శకుడు కొర్ర శంకర్ నాయక్ ముప్పలను పరిచయం చేస్తూ ప్రసాద్ రాజు నిర్మిస్తున్న చిత్రమిది. ఇటీవల ఫిలింఛాంబర్లో చిత్ర ఫస్ట్ లుక్, సాంగ్‌ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన టి.యఫ్.సి.సి. ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్, లయన్ సాయి వెంకట్ విడుదల చేశారు. చిత్ర దర్శకుడు కొర్ర శంకర్ నాయక్ మాట్లాడుతూ, 'తెలంగాణలో 12,000, ఆంధ్రలో 13,000 సర్పంచ్‌లు ఉన్నారు. వారందరి సాధక బాధకాలను ఇతివృత్తంగా చేసి 'మా మంచి సర్పంచి మా..శంకరన్న మాట తప్పని వాడు మన శంకరన్న'' పాటను రెండు తెలుగు రాష్ట్రాల సర్పంచ్‌లందరికీ అంకితం చేస్తున్నాము. ఇప్పటి వరకు 30 శాతం షూటింగ్ పూర్తయ్యింది' అని తెలిపారు.