Sun 18 Apr 01:37:19.985795 2021
Authorization
జీవితం అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో అనుకోని ఉపద్రవం వచ్చింది. ఒక సినిమాలో నేను చేసిన పాత్ర వల్ల, సహనటుడుతో రొమాన్స్ సన్నివేశంలో అన్ని అయి పోయాయి అని వచ్చిన రూమర్స్, ఆనందంగా సాగుతున్న తమ జీవన నావను ఉప్పెనలా వచ్చి మింగేసింది. ఆ రూమర్స్ రాజేష్‌లో చాలా మార్పు తీసుకువచ్చాయి. నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నా వత్తిని గౌరవిస్తాను అన్న అదే వ్యక్తి ఈ రోజు నాపై వచ్చిన అపోహలు నమ్ముతున్నాడు.
ప్రముఖ నటి ''సీతా దేవి'', బిజినెస్ మాన్ ''అభిరామ్''ను పెళ్లి చేసుకోబోతున్నారు. దీనిపై ప్రజల స్పందన వారి మాటల్లోనే తెలుసుకుందాం.. అని ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న డిబేట్‌ను చూస్తుంది సీత అలియాస్ సీతాదేవి. ఇప్పుడు ఛానల్స్‌కి దొరికిన ఫ్రెష్ న్యూస్ తనే అని, తన జీవితంతో వ్యాపారం చేసి వారి టీఆర్పీని పెంచుకుంటున్నారు అని బాధ పడుతూ ఆ డిబేట్‌ను చూస్తుంది.
నిజమే, జీవితంలో విరామం తీసుకునే వయసులో మళ్లీ పెళ్లంటే అంతా ఇలానే అనుకుంటారేమో? అయినా ఇది నా జీవితం.. ఏం చేస్తే వీళ్ళకు ఎందుకు? కొంతమంది మంచి పని అని.. కొంతమంది ఈ వయసులో ఇంకేం కావాలో అని??? ఎదుటి వారి జీవితాలు అంటే అందరికీ ఆసక్తి ఎందుకో?? పెళ్లంటే సెక్స్ ఒకటేనా?? న్యూస్ చానల్స్‌లో సోషల్ మీడియాలో వచ్చే స్పందన చూస్తూ తన గతంలోకి వెళ్ళిపోయింది.
చిన్నప్పటి నుండీ నటన మీద ఉన్న ఇష్టంతో ప్రయత్నాలు చేస్తుంటే, ఎక్కువ కష్టపడకుండానే హీరోయిన్గా అవకాశం అందుకుంది. అందంగా ఉండబట్టే దర్శకుడి దగ్గర అవకాశం సులభంగా వచ్చిందని అన్నారంతా... కానీ తన నటనను చూసి ఎవరూ చెప్పేవారు కాదు. కొద్దికాలంలోనే తన నటనతో అందరినీ మెప్పించింది. ప్రేక్షకులు నీరాజనాలు అందుకొంది.
అలా సినిమాల్లో బిజీగా ఉన్న రోజుల్లో ఒక ఫంక్షన్లో రాజేష్ కలిశాడు. తనకు పెద్ద అభిమానిని అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. పరిచయమైన కొద్దిరోజుల్లోనే అది స్నేహంగా మారింది. కొంతకాలానికి ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులను ఒకరివి మరొకరు గౌరవించుకున్నారు. తమ ప్రేమబంధాన్ని పెళ్లితో సుస్థిరం చేసుకున్నారు.
పెళ్లి, ప్రతి ఆడపిల్ల జీవితంలో లాగానే తను జీవితంలో కూడా చాలా ఆనందం నింపింది. తనకంటూ ఒక కుటుంబం, ప్రేమించే భర్త, ప్రపంచంలో తనొక్కతే అదష్టవంతురాలు అని మురిసిపోయింది. ఇక నటనకు స్వస్తి చెప్పి తన నూతన జీవితం మొదలు పెట్టాలనుకుంది. కానీ, రాజేషే అందుకు అంగీకరించలేదు. మన పెళ్లి నీ కలలకు అడ్డు కాకూడదు. నటన నీ వత్తి. దానిని నేను ఎప్పుడూ గౌరవిస్తాను అని ప్రోత్సాహం అందించడంతో ఆనందంతో తన నట జీవితాన్ని పున:ప్రారంభించింది.
జీవితం అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో అనుకోని ఉపద్రవం వచ్చింది. ఒక సినిమాలో నేను చేసిన పాత్ర వల్ల, సహనటుడుతో రొమాన్స్ సన్నివేశంలో అన్ని అయిపోయాయి అని వచ్చిన రూమర్స్, ఆనందంగా సాగుతున్న తమ జీవన నావను ఉప్పెనలా వచ్చి మింగేసింది. ఆ రూమర్స్ రాజేష్‌లో చాలా మార్పు తీసుకువచ్చాయి. నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నా వత్తిని గౌరవిస్తాను అన్న అదే వ్యక్తి ఈ రోజు నాపై వచ్చిన అపోహలు నమ్ముతున్నాడు.
రాజేష్... ''ఇది అంతా నిజం కాదు అని నీకు తెలియదా??'' గట్టిగా అడిగింది.
''స్టాప్ ఇట్ సీతా'' అంతకంటే గట్టిగా అరిచాడు... ''అక్కడ ఏం జరిగిందో మీడియా మొత్తం కోడై కూస్తునే ఉంది''..
'నిజం కాదు రాజేష్... అది నీకు తెలుసు'' అంది.
''నిజం ఏంటో నాకు నీకు తెలిస్తే సరిపోదు సీతా... ఈ సమాజానికి తెలియాలి... నీ మీద వేసింది నిందనే అవ్వచ్చు.. అది అబద్దం అని నువ్వు రుజువు చేయగలవా??'' అని ప్రశ్నించాడు.
''రాజేష్... ఎవరో పనిలేని వాళ్ళు చేసే కామెంట్లు పట్టుకొని నువ్వు మన మధ్య దూరం పెంచడం ఎంతవరకు సమంజసం??'' అడిగింది.
''సీతా...మళ్లీ మనం ఈ సమాజంలోనే బతకాలి... ఏదురొచ్చే ఎన్నో కామెంట్స్ వినాలి.. నాకు అంత భరించే ఓపిక లేదు.. నువ్వు నటించడం మానేయి... వేరే ఎక్కడకి అయిన వెళ్లి సంతోషంగా ఉందాం..'' అన్నాడు.
''అంటే ఏంటి రాజేష్ నీవు అనేదీ? ఇప్పుడు నేను నటించడం మానేస్తే సమస్య పరిష్కారం అయినట్లేనా? అంటే తప్పు నిజమే అని నేనే ఒప్పుకున్నట్లు... అది నేను ఎప్పటికీ చేయను.. నేను ఎప్పుడు తప్పు చేయను రాజేష్..'' తీవ్ర స్వరంతో హెచ్చరించింది.
''ఇప్పుడు నాతో రాను అంటావా??'' అడిగాడు.
''కాదు రాజేష్.. ఇక్కడే ఉండి పరిస్థితులు ఎదుర్కొని పోరాడదాం... అంటున్నా'' సమాధానం చెప్పింది.
''ఇప్పుడు అర్థం అవుతుంది సీతా.. నీకు ఇక్కడ ఉండటం ఇష్టం.. ఎందుకంటే ఆ రూమర్స్ నిజమే... అందుకే ఇది అంత...''
''రాజేష్, చ ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకొంది.. మన ప్రేమ పెళ్లి.. ఇదేనా విలువ ఇచ్చింది... పెళ్లి కలలకు అడ్డు కాదు అన్నావు.. కానీ నువ్వే ఇప్పుడు అడ్డు చెప్తునావు.. నమ్మకం అనేది ఇద్దరి మధ్య ఉండాలి.. నా మీద నీకు లేదు అని అర్థం ఐంది... నిజంగా.. i hate you...'' అంటూ వర్తమానంలోకి వచ్చింది.
ఇప్పుడు నా పట్ల ప్రేమ లేదు, ద్వేషం తప్ప. తనకు ఏమీ కాను అని నన్ను, కడుపులో మా ప్రేమకు ప్రతిరూపంను వదిలేసి వెళ్లిపోయాడు.
ఆ తరువాత అది తట్టుకోవడానికి తనకు చాలా కాలం పట్టింది. తన జీవితంలోకి సిద్ధు రాకతో బతుకు మీద ఆశలు మొదలయ్యాయి సిద్ధునే ప్రపంచంగా వాడి కోసం నటించడం మొదలు పెట్టాను. వాడికి తల్లిగా మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే నా కష్టమంతా. నాకు, సిద్ధుకి ఎటువంటి రహస్యాలు లేకుండా, వాళ్ళ నాన్న గురించి అన్ని చెప్పే పెంచాను. చిన్న తనం నుండే సమాజం పట్ల ఒక అవగాహన కల్పిస్తూ మంచి విలువలతో పెంచాను. అయితే తను చేసిన తప్పేంటి?? ఎందుకు జనాలు కాకుల్ల పొడుస్తున్నారు ??
కొన్ని రోజుల క్రితం, కాలేజీ రీయూనియన్ ఫంక్షన్లో తన క్లాస్మేట్ అభిరామ్ కలిశాడు. అప్పట్లో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. కాలేజీ తర్వాత ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉండి మళ్ళీ కలవలేకపోయారు. ఇన్ని రోజులకు కలిశారు. ఆ తర్వాత నుండి ఫ్రెండ్స్ కలుస్తూనే ఉన్నారు.
అభి కి, తన వైఫ్ కు, అభిప్రాయ భేదాల వల్ల డైవర్స్ తీసుకుని తన లైఫ్‌లో బిజీగా ఉంటున్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ మా స్నేహం మొదలైంది. అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. సిద్ధు కూడా తనతో ఉండటం చాలా హ్యాపీగా ఉంది.
ఒకరోజు అభి నన్ను కలిసి ''సీతా మనం పెళ్లి చేసుకుందామా ??'' అని అడిగాడు
''ఏంటి???'' అర్థం కాలేదు.. అంది.
''సీతా నీకు తెలుసు కదా.. దివ్య నేను విడిపోయాక, మళ్లీ పెళ్లి చేసుకోలేదు. నాకు అలాంటి ఆలోచనలు కూడా రాలేదు. జీవితంలో ఒక స్థాయికి చేరుకోవాలని, బిజినెస్ మీద ఎక్కువ దష్టి పెట్టి ఇప్పుడు ఈ పొజిషన్‌కి వచ్చాను. కానీ జీవితంలో ఒక వయసు వచ్చాక, మనకు ఒక తోడు ఉంటే బాగుండు అనిపిస్తుంది.'' అని వివరిస్తాడు. ''ప్రేమించే ఒక మనిషి నీకు ఏమైనా నేనున్నా అనే భరోసా'' ఆ వయసులో చాలా అవసరం అనిపిస్తుంది. ఇది ఆకర్షణతో వచ్చే ప్రేమ కాదు, మనది ఆ వయసు కూడా కాదు. నాకు కావాల్సింది ఒక తోడు. నువ్వు నాకు తోడుగా ఉంటావా???
అభి.. ఏం మాట్లాడుతున్నావు?? ఇప్పుడు ఈ వయసులో?? సిద్ధు ఏమనుకుంటాడో?? నువ్వు చెప్పేది నిజమే కానీ మన చుట్టూ ఉండే సమాజం ఏమనుకుంటుంది??
సీతా.. నువ్వు నీ గురించి ఆలోచించు.. రాజేష్ నిన్ను వదిలేసినప్పుడు ఈ సమాజం నీకు తోడుగా ఉందా?? లోకం తీరే అంత సీతా... ఎదుటివారిని నిందుస్తునే ఉంటుంది. నువ్వు నీకు ఏం కావాలో నిర్ణయించుకో?? నేను నీకోసం, సిద్ధు కోసం.. మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
ఆ రోజు అభితో మాట్లాడాక, జరిగింది అంతా సిద్ధుతో చెప్పాను.
''అమ్మ, అభి అంకుల్ చెప్పింది నిజమే... ఎన్ని రోజులు నీ లైఫ్ నా కోసమే అని బతుకుతావు.. నీకు ఒక తోడు కావాలి.. ఇది అసలు నువ్వు ఎప్పుడో చేయాలి.. ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు.. నేను ఎప్పుడూ నీ గురించి భయపడకర్లేదు.. ఒంటరిగా ఉన్నావా అని ఆలోచన అవసరం లేదు.. అంకుల్‌కి సంతోషంగా చెప్పు ఇది మన ఇద్దరికీ ఇష్టమే అని...
కానీ సిద్దు..
''అమ్మా, నీతో సంబంధం లేని ఎవరి కోసమో, బయట సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించకు. ఇది నీ జీవితం, నీ కోసం వాళ్ళు ఎవరు రారు.. నీ కష్టం నువ్వే పడాలి.. నీ కన్నీళ్లు వాళ్ళు వచ్చి తుడవరు.'' Dond't waste your emotions & valuable time on idiotic people''. అంకుల్ చాలా మంచి వారు. నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు.
సిద్ధుతో మాట్లాడక, తన ఆలోచన విధానం చూసి నా పెంపకం మీద గర్వంగా అనిపించింది.. జీవితంలో నాకు తోడు అవసరమే అనిపించింది..
సిద్ధునే దగ్గరుండి, పెళ్ళి పెద్దగా మారి మా ఇద్దరికీ పెళ్లి చేశాడు. అంతా హ్యాపీగా ఉంది కానీ మళ్ళీ అదే జనాలు అవే మాటలు..
మేడం మీరు ఈ వయసులో మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది?? మీ పెళ్లిపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్‌కి మీ స్పందన ఏమిటి ??
''ఈ సొసైటీలో పెళ్ళాం చనిపోయిన రెండో రోజు మళ్లీ పెళ్లి చేసుకున్న సమర్ధిస్తారు కానీ ఒక ఆడవాళ్లు రెండో పెళ్లి చేసుకుంటే అది కామం కింద జమకట్టేస్తారు. ఆడవాళ్లే తప్పు చేయాలి అనుకుంటే ఎలా అయినా చేయవచ్చు. ఇది ఎవరికీ అర్థం కాదు''
మనం ఎంతో అభివద్ధి చెందుతున్నాం అని అనుకుంటున్నాం కానీ ఇంకా మన ఆలోచన స్థాయి అక్కడే ఉంది. పెళ్లి అనేది ఒక తోడు కోసం.. ఈ సమాజం లో స్త్రీలు ఎంత అభివద్ధి చెందినా, చట్ట సభల్లో, రాజకీయాల్లో ముందడుగు వేస్తున్నా.. ఇంకా లింగ వివక్షత పేరుతో బాధపడుతూనే ఉన్నారు. ఇంకా మనం సతీ సహగమనం కాలంలో ఉన్నామా?? రెండో పెళ్లి నేరమా?? ఒక స్త్రీ తోడు కొరుకోకుడదా?? భర్త చనిపోయిన లేక వదిలేస్తే, ఇక ఒంటరిగా మిగిలి పోవడమెనా?? సీతలా అగ్నిలో దుకాలా తనపై నింద రుజువు చేయడానికి?? ఏది అవసరం లేదు.. ఆడది ఎందుకు బావిలో కప్పలా ఉండాలి.. తన చుట్టూ ఉన్న గోడలను బద్దలు కొట్టుకుని తన స్వేచ్ఛా ప్రపంచంలో ఎగరిపోగలదు.. తన కోసం తను బతక గలదు. ఇది చెప్పినా వీళ్ళకి అర్థం కాదు.
ఇది నా జీవితం నా ఇష్టం. ఎవరి కోసమో నా ఆనందాన్ని వదలుకోకుడదు. మనసులో అనుకొని చిరునవ్వుతో, అభిరామ్ చేయి పట్టుకొని కొత్త పయనం కై అడుగు వేసింది అభినవ సీతలా...
- వజ్రాల ప్రియాంక,
9948523883