Sat 01 May 19:44:21.878179 2021
Authorization
తాతయ్య విషయంలో భాద్యతగా వ్యహరించ లేదు, ఆయనకు తోడుగా ఎవరమైన ఉంటే, ఇంత అనర్ధం జరిగి ఉండేది కాదు? మనసులోనే బాధ పడసాగింది సంధ్య. తాతయ్య కాస్త కుదుటపడ్డాక నిమ్మదిగా లేచి కూర్చున్నాడు. సంధ్య తాతయ్య దగ్గరికి చేరి వొళ్లో తలపెట్టుకొని ఏడుస్తూ ''ఎంతో కష్ట పడి నన్ను ప్రయోజకురాలిగా తీర్చి దిద్దిన నీకు రుణపడి ఉంటాను.'' ''నీదగ్గర ఎవ్వరు లేకుండా నిన్ను ఒక్కడినే విడిచి బాధ్యత మరచి'' నీ విషయంలో తప్పు చేసాను. నన్ను క్షమించు తాతయ్య'' అంది సంధ్య. ''తాతయ్య చిరునవ్వుతో సంధ్య చేతిని తనచేతిలోకి తీసుకొని సున్నితంగా నొక్కివిడిచాడు. ఏమీ పర్వాలేదు అన్నట్లుగా.
ఇటీవల జరిగిన సంఘటన పదే పదే గుర్తు చేసికొంటూ మనసులోనే కుములిపోసాగింది సంధ్య! సంధ్యది ఒక మధ్యతరగతి కుటుంబం. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సంధ్య తాతయ్య పెంపకంలో పట్టుదలతో ఎంతో కష్టపడి చదువుకొని ప్రయోజకురాలు అయినది. కొత్తగా ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరిన సంధ్య, తాతయ్య కోరిక మేరకు ''తనకు ఉద్యోగం వస్తే కుటుంబం తో సహా తిరుపతి పుణ్య క్షేత్రానికి వస్తానని'' మొక్కుకుంది.
శని ఆదివారాలు సెలవు కావటం వల్ల మరో నాలుగు రోజులు సెలవు తీసుకొని భర్త, పిల్లలు అమ్మ, తాతయ్య మిగతా కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి పుణ్య క్షేత్రానికి బయలుదేరింది.
అలా బయలు దేరిన సంధ్య కుటుంబం, ట్రైన్ ఎక్కింది మొదలు పిల్లల ఆటపాటలతో,
కేరింతలతో, సెల్పీలు దిగుతూ ఆ ఫోటోలను స్నేహితులకు, బందువులకు పోస్ట్ లు పెడుతూ ఎంతో సంతోషంగా ప్రయాణం కొన సాగింది.
అక్కడ ఉన్న నాలుగు రోజుల్లో చుట్టుప్రక్కల ఉన్న ముఖ్యమైన ప్రదేశాలన్నియు కుటుంబ సభ్యులకు చూపించాలి అని, నా వాళ్లందరికీ, ఇది మరచి పోలేని యాత్రగా గా మిగలాలని మనసులో అనుకుంది సంధ్య. అందరూ కబుర్లతో, ఆట పాటలతో అలసిపోయి చిన్నగా నిద్రలోకి జారుకున్నారు. సంధ్యకు మాత్రం నిద్ర రావటం లేదు. ఎప్పటినుండో తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అనే కుటుంబ సభ్యుల కోరిక ఈ నాటికి నెరవేరుతున్నందుకు కుటుంబ సభ్యుల ముఖాల్లో ఎంతో ఆనందంకనపడుతో%ళి%ది. ''ముఖ్య%ళి%గా తాతయ్య ముఖంలో'' !
ఇలా రాత్రంతా సంధ్య ఆలోచనలతో ఉండగానే ట్రైన్ తన గమ్యం స్థానం చేరుకుంది.
సంధ్య కూడా తన ఆలోచనలనుండి బయటి ప్రపంచం లోకి వచ్చింది. అందరూ, రైలు దిగి తాము ముందుగా బుక్ చేసుకున్న వసతి గృహానికిచేరుకున్నారు.త్వర త్వరగా స్నానాలు ముగించుకొని దేవుని దర్శనానికి అందరూ కొండ పైకి బయలు దేరారు. దర్శనం కొరకు లైన్ లో నిలబడ్డ సంధ్య కుటుంబ సభ్యులు, ఎవరి పిల్లల్ని వారుచూసుకోవటంలో నిమగంఅయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉండటంవల్ల లైన్ చాలా రద్దీ గా ఉంది. తాతయ్యది పెద్దవయసు కావటం వలన, ''నేను లైన్ లో నిలబడ లేను,'' చాలా అలసటగా ఉంది ఇక్కడే ఎక్కడైనా కూర్చుంటాను, మీరు వెళ్లి రండి అన్నాడు.
అందరూ సరే, అని తాతయ్యకు తగు జాగ్రత్తలు చెప్పి మేము వచ్చేవరకు ఇక్కడే కూర్చో, ఇక్కడనుండి ఎటూ వెళ్ళకు, ఫోన్ దగ్గర ఉంచుకో అని చెప్పారు.
తాతయ్యకు అసలే చాదస్తం ఎక్కువ! ఎవరిమాట ఒక పట్టాన వినడు. ''నాకు ఫోన్ గీను ఏం వద్దు, మీరు వెళ్లి రండి, మీరు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటా అన్నాడు.'' సరేలే, ! తొందరగానే వస్తామని చెప్పి, అందరూ ముందుకుసాగారు.
ఆ రోజు దర్శనం కాస్త ఆలస్యంగానే అయింది. వెను తిరిగిన సంధ్య, ''తాతయ్య ఏం జేస్తున్నాడో, ఏమో అనే ఆందోళనతో అయన కూర్చున్న చోటికి వచ్చింది.''
అక్కడ తాతయ్య కనిపించలేదు. సంధ్యతో పాటు అందరూ ఒక్కసారి భయాందోళనకు గురై వెతకటం ప్రారంభించారు. తాతయ్య ఎక్కడా కనిపించలేదు, దగ్గరలో ఉన్న బాత్ రూమ్ కు గాని వేళ్ళాడేమోనని అక్కడ వెతికారు, అక్కడా కనిపించలేదు.
ఎంక్వయిరీ కౌంటర్ లో తాతయ్య పేరు, ఊరు, అడ్రస్ చెప్పి మైక్ లో ప్రకటన చేయించారు, కాని ఎలాంటి ఆచూకీ లేదు. తాతయ్య గురించి తలో దిక్కువెతకటం ప్రారంభించారు.
ఆ రోజంతా వెతకటంతో సరిపోయింది. తాతయ్య జాడ మాత్రం తెలియలేదు.
తెల్లవారి పోలీస్ స్టేషన్ లో ఊరు అడ్రస్, తాతయ్య ఫోటో, అందజేసి, వసతి గృహానికి చేరుకున్నారు. ఆ రాత్రి అంతా ఎవరికీ నిద్ర లేదు ! భారంగాగడిచింది. సంధ్య మరో రెండు రోజులు సెలవులు పొడిగించుకొని తీవ్రంగా ఎంత వెతికినా ఫలితం కనిపించలేదు? అలా వారం రోజులు గడచిపోయాయి. సంధ్య సెలవులు ఐపోయాయి. చేసేది ఏమి లేక పోలీస్ స్టేషన్ లో మరొక మారు కలసి, ఫోన్ వివరాలు, అడ్రస్ ఇచ్చి విషాద వదనాలతో ఇంటికి వెనుతిరిగారు.
తిరుగుప్రయాణంలో అంతా నిశ్శబ్ద%ళి%. ఎవరిమనస్సులోవారుమౌనంగారోదిస్తున్నారు.పెద్ద దిక్కు ఐన తాతయ్య లేకుండావెళ్తున్నందుకు ! సంధ్య మనస్సులో అన్నీ ప్రశ్నలే? , తాతయ్య ఏమైఉంటాడు? బయటకు వెళ్లి తప్పిపోయాడా? పుణ్యక్షేత్రంలో ఐతే పుణ్యం వస్తుందని ఏదయినా అఘాయిత్యానికి పాల్పడ్డాడా? ఇంటి దగ్గరే ఉంచివస్తే బాగుండేదేమో ! అనవసరంగా తీసుకువచ్చామా? అందరం కలసి వచ్చి తాతయ్యను పోగొట్టుకున్నాము.దేవుడి దర్శనానికి వస్తే ఇలా జరిగిందేమిటి? ఇదంతా నా అజాగ్రత్త వల్లనే జరిగింది. తాతయ్య లేకుండా వెళ్తున్నందుకు సంధ్య బోరుమని విలపించింది.
ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులకు తాతయ్యలేని ఇల్లుకూడా బావురుమన్నట్లు కనిపించింది.
చుట్టుప్రక్కలవారు తాతయ్య ఎక్కడ అని అడగటంతో జరిగిన విషయం చెప్పి అందరూ ఒక్కసారి గొల్లుమన్నారు.
చూస్తుండగానే మూడు నెలలు గడచిపోయాయి. కనిపించకుండా పోయిన తాతయ్య బ్రతికున్నాడా? లేడా? ఇంతవరకు ఎటువంటి సమాచారం తెలియ లేదు.?
ఒక వేళ తాతయ్య మరణించి ఉన్నట్లయితే ఆయనకు చేయించాల్చిన కార్యక్రమాలు
జరిపిస్తే బాగుంటుందేమో? అయన ఆత్మకు శాంతి ఐనా లభిస్తుంది, తెల్లవారి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి, ఆలోచిస్తూ... నిద్రలోకి జారుకుంది సంధ్య.
వేకువ జామునుండే గ్రామస్తులు ఎవరి పనుల్లోవారు నిమగమై ఉన్నారు.వీధి పంపుల వద్ద నీళ్ల పట్టేవారు, వాకిళ్ళలలో ముగ్గులు పెట్టె వారితో వీధిలో సందడిగా ఉంది.
ఎవరో సంధ్యను బిగ్గరగా పిలిచినట్లు అనిపించి . హఠాత్తుగా నిద్రనుండి లేచి పరుగు పరుగున సంధ్య బయటకు వచ్చింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి స్థాణువులా నిలబడిపోయింది. నోటివెంట మాట రావటం లేదు? ఇది కలా నిజమా?
మాసిన బట్టలు, పెరిగిన గడ్డంతోబాగా నీరసించిపోయి ఇంటి ముందు నిలబడి ఉన్న ఒక వ్యక్తిని చూసి!
కుటుంబసభ్యులందరు ఆశ్చర్యానందంలో మునిగిపోయారు.
''వచ్చింది తాతయ్యే'' అని గుర్తించిన సంధ్య ఆయన్ను గట్టిగా పట్టుకొని బిగ్గరగా ఏడుస్తూ, మూడు నెలలుగా అనుభవించిన తన గుండె లోని బరువు నంతా తీర్చు కుంది.
ఇన్ని రోజులు ఎక్కడ తిరిగాడో,? ఏం తిన్నాడో? ఎవరు ఆదరించారో? అవన్నీ తాతయ్య కాస్త కుదుట పడ్డాక అడిగి తెలుసుకోవచ్చు. తాతయ్య క్షేమంగా ఇంటికి చేరాడు నా కదే చాలు! లేదంటే జీవితాంతం నా కిది తీరని బాధగా మిగిలేది.
ఎవరి పిల్లల్ని వాళ్ళం జాగ్రత్తగా చూసుకున్నామే గాని, తాతయ్య విషయంలో భాద్యతగా వ్యహరించ లేదు, ఆయనకు తోడుగా ఎవరమైన ఉంటే, ఇంత అనర్ధం జరిగి ఉండేది కాదు? మనసులోనే బాధ పడసాగింది సంధ్య. తాతయ్య కాస్త కుదుటపడ్డాక నిమ్మదిగా లేచి కూర్చున్నాడు.
సంధ్య తాతయ్య దగ్గరికి చేరి వొళ్లో తలపెట్టుకొని ఏడుస్తూ
''ఎంతో కష్ట పడి నన్ను ప్రయోజకురాలిగా తీర్చి దిద్దిన
నీకు రుణపడి ఉంటాను.'' ''నీదగ్గర ఎవ్వరు లేకుండా నిన్ను ఒక్కడినే విడిచి బాధ్యత మరచి'' నీ విషయంలో తప్పు చేసాను.
నన్ను క్షమించు తాతయ్య'' అంది సంధ్య. ''తాతయ్య చిరునవ్వుతో సంధ్య చేతిని తనచేతిలోకి తీసుకొని సున్నితంగా నొక్కి విడిచాడు. ఏమీ పర్వాలేదు అన్నట్లుగా.
''అమ్మయ్య అనుకుంది సంధ్య తన మనసులోనే'' అప్పటికి ఆమె మనసు కుదుటపడి తృప్తిగా నిట్టూర్చింది.
ఎవరో సంధ్యను బిగ్గరగా పిలిచినట్లు అనిపించి . హఠాత్తుగా నిద్రనుండి లేచి పరుగు పరుగున సంధ్య బయటకు వచ్చింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి స్థాణువులా నిలబడిపోయింది. నోటివెంట మాట రావటం లేదు? ఇది కలా నిజమా? మాసిన బట్టలు, పెరిగిన గడ్డంతోబాగా నీరసించిపోయి ఇంటి ముందు నిలబడి ఉన్న ఒక వ్యక్తిని చూసి! కుటుంబసభ్యులందరు ఆశ్చర్యానందంలో మునిగిపోయారు. ''వచ్చింది తాతయ్యే'' అని గుర్తించిన సంధ్య ఆయన్ను గట్టిగా పట్టుకొని బిగ్గరగా ఏడుస్తూ, మూడు నెలలుగా అనుభవించిన తన గుండె లోని బరువు నంతా తీర్చు కుంది.
- తిరుపతి కృష్ణవేణి