Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఈ నెల 9వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించిన విషయం విదితమే. ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 16వ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు ఆదేశించారు. అయితే ఆయా కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.