Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. జూన్ 2 నుంచి 21 రో జులపాటు రాష్ట్రమంతా వైభవోపేతంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు బుధవారం మ ధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగనున్నది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మ న్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో పార్టీ శ్రేణుల భాగస్వామ్యం ఎలా ఉండాలి? ఏయే అంశాలను పార్టీ ప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి? వంటి అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.