Authorization
Mon May 05, 2025 07:28:04 pm
జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
నవతెలంగాణ - బోనకల్
పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మధిర నియోజక వర్గంలో ఎంతో మందికి ఆర్థిక చేయూ త అందజేసినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తెలిపారు. మండల కేంద్రంలోని టిఆర్ఎస్ కార్యాలయంలో చిన్న బీరవల్లి గ్రామానికి చెందిన తెలకపల్లి లక్ష్మి 60 వేలు, వేసం ప్రసాద్ 20 వేలు చెక్కులను శుక్రవారం కమల్ రాజు అందజేశారు.టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరావు కషితో ఇవి మంజూరయ్యాయి. వీటిని లబ్ధిదారులకు ఆయన అందజేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ రావు టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఎంగల కనకయ్య ఆ పార్టీ నాయకులు కిన్నెర పాపారావు, చావా హనుమంతరావు, రేగళ్ల వీరయ్య ,గుమ్మ నాగేశ్వరరావు, చెరుకూరి రామకష్ణ, పేరబత్తిని శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.