Authorization
Wed May 07, 2025 02:13:39 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
మండలంలోని ఎం.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన సిపిఎం సానుభూతిపరుడు వేముల కొండయ్య (70) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. కొండయ్య మృతదేహాన్ని పార్టీ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, మండల నాయకులు బందెల వెంకయ్యలు సందర్శించి ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నివాళులర్పించిన వారిలో సిపిఎం నాయకులు వడ్లమూడి నాగేశ్వరరావు, ఏపూరి వరకుమార్, రామనాథం, నాగేశ్వరరావు, పాపిట్ల సత్యనారాయణ, రామగిరి, నాగరాజు తదితరులు ఉన్నారు.