Authorization
Tue May 06, 2025 06:26:21 am
నవతెలంగాణ- ఖమ్మం
నగరంలో త్రివేణి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని త్రివేణి పాఠశాలల డైరెక్టర్ వీరేంద్ర చౌదరి తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి ఈ ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తత్వ, చిత్ర లేఖనం, పాటల పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. వివిధ వేషధారణలో చిన్నారులు చూపరులను ఎంతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో అధిపతి వై.వెంకటేశ్వర రావు, సి.ఆర్.ఒ. మురళీకృష్ణ, అకడమికీ' ఇంచార్జి ముస్తఫా, ఐఐటి ఇంచార్జి అశోక్, కిడీ ఇంచార్జి శ్రీదేవి, క్యాంపస్ ఇంచార్జి చార్లెస్, ట్రాన్స్పోర్ట్'' ఇంచార్జి సందీప్ ఉపాధ్యాయ బృందం, పాల్గొన్నారు.