Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గురు'కులం'లో కల్లోలం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

గురు'కులం'లో కల్లోలం

నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గురుకులం అంటే గురువు కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి విజ్ఞానాన్ని అందించాలి. అనే ఉద్దేశంతో ప్రాచీన విద్యావిధానం ఆధారంగా ప్రభుత్వాలు వీటిని నెలకొల్పాయి. కానీ ఖమ్మం రీజియన్‌ పరిధిలోని పలు గురుకుల విద్యాసంస్థలు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయనే విమ ర్శలు వస్తున్నాయి. గురువు కుటుంబంలో ఒకరిగా కాకుండా 'కులం'లో కలిసిపోయి విజ్ఞానానికి బదులు వివక్షపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా పాలన గాడితప్పి పలువురు విద్యార్థులు పాఠశాలల్లో ఉండలేక పరారయ్యే ప్రయత్నంలో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. గురువుల మధ్య అనైక్యత ప్రభావం విద్యార్థులపైనా పడుతోంది. అను'కుల' ప్రధానో పాధ్యాయుడైతే ఓ రకంగా లేదంటే మరోరకంగా వ్యవ హరిస్తూ గురుకుల విద్యావ్యవస్థను కొందరు ఉపాధ్యా యులు ఉద్దేశపూర్వకంగా భ్రష్టు పటిస్తుంటే...దానిని నియం త్రించాల్సిన ప్రాంతీయ అధికారి సైతం 'వక్ర'మార్కులకే వంతపాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల గురుకులాల్లో చోటుచేసుకున్న కొన్ని ఉదంతాలు...
పాలన గాడితప్పడంతో ఇటీవలికాలంలో గురుకులాల్లో కొన్ని ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం నగరంలోని బమ్మ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న ఎస్సీ గురుకుల పాఠశాల (ముదిగొండ)లో ఐదో తరగతి చదివే విద్యార్థి రాజేష్‌ పురుగుల అన్నం తింటూ వసతిగృహంలో ఉండలేక ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. తాను నిద్రిస్తున్న గది కిటికీలో నుంచి కిందకు దూకడంతో ఆ విద్యార్థి తలకు తీవ్రగాయమైంది. కుడి చేయి విరిగింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది.
వైరా గురుకులంలో ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. కరోనా పాజిటివ్‌ అని తేలగానే అందరికీ పరీక్షలు చేయించారు. మొత్తంగా 29 మంది విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణైంది. ముందస్తు అప్రమత్తత లోపించడంతోనే ఈ పరిణామం చోటు చేసుకుందనే విమర్శలు వచ్చాయి. నాటి నుంచి పాఠశాలలకు పేరెంట్స్‌ అనుమతించే విషయంలో ఆంక్షలు విధించారు.
- ఖమ్మం నగరంలోని దాన్వాయిగూడెం బాలికల గురుకుల కళాశాలలో మూడు రోజులు నీటి సమస్య ఏర్పడినా ఎవరూ పట్టించుకోలేదు.
- ముల్కలపల్లి స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రాంతీయ అధికారి (ఆర్‌సీవో) దృష్టికి తీసుకొచ్చారు. అయినా పరిష్కారం కాకపోవడంతో నాటి సాంఘిక సంక్షేమ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవవీణ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు.
- భద్రాచలం బాలికల గురుకుల పాఠశాలలోనూ కొంతమంది టీచర్లను ప్రధానానోపాధ్యాయురాలికి వ్యతిరేకంగా ప్రాంతీయ అధికారి ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆర్‌సీవో అండతో అన్నపురెడ్డిపల్లి గురుకులం అస్తవ్యస్తం!
భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి కళాశాల విషయంలో ఆర్‌సీవో జోక్యం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె సామాజికవర్గానికి చెందిన ఓ ఐదుగురు టీచర్లను ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని సమాచారం. ఆర్‌సీవో అండతో అక్కడి ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్‌ను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని ఆరో పణలు వస్తున్నాయి. ఇదే అదనుగా సంబంధిత ఉపాధ్యా యులు తాగి పాఠశాలకు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధా నోపాధ్యాయున్ని అబాసుపాలు చేసేందుకు తమ సామాజికవర్గానికి చెందిన కొందరు పిల్లలను దుర్వ్యస నాలకు అలవాటు చేశారని తెలిసింది. వారు పాఠశాలలోని ఆహారపదార్థాల్లో సర్ప్‌ వంటివాటిని కలుపుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆమధ్య సాంబార్‌లో సర్ప్‌ కలపడంతో ఒకరిద్దరు పిల్లలు వాంతులు, విరేచనాల వడంతో వెంటనే గుర్తించి మిగిలిన విద్యార్థులకుదాన్ని వినియోగించలేదని తెలిసింది.
ఆర్‌సీవోపై అభియోగాలు...
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలోని 29 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ప్రాంతీయ అధికారి (రీజినల్‌ కోఆర్డినేటర్‌)పై అనేక అభియోగా లున్నాయి. గతంలో ఆమె తొర్రూరు గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆ సమయంలో అనేక అవకత వకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయినా ఆమెకు పదోన్నతి కల్పించి నిబంధనలకు విరుద్ధంగా సొంత జిల్లాకు ఆర్‌సీవోగా బదిలీ చేయడం వివాదాస్పదమవు తోంది.ఇటీవల ఆమె కుమారుని వివాహం సందర్భంగా ఒక్కో ప్రిన్సిపాల్‌ నుంచి రూ.5,000 చొప్పున ఏఆర్‌సీవో ద్వారా వసూలు చేయించారని సమాచారం. 2020 మార్చిలో కరోనాకు ముందు నిర్వహించిన ప్రాక్టికల్‌ పరీక్షల్లో అన్నపురెడ్డిపల్లి గురుకులంలో తన సామాజికవర్గం టీచర్‌ ద్వారా ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణకు వచ్చిన డబ్బులను విధుల్లో లేని ఉపాధ్యాయుల పేరుతో కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం అన్నపురెడ్డిపల్లి గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై అక్కడి ఉపాధ్యాయులు నాటి గురుకుల విద్యాసంస్థల సెక్రటరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు రహస్య నివేదిక పంపారు. పాఠశాల నిర్వహణకు ఆటంకంగా మారిన ఒకే సామాజికవర్గం టీచర్లను తొలగించాల్సిందిగా ఆ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. ఒకే సామాజికవర్గానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించి ఇతర సామాజికవర్గ టీచర్లను ఎలా దెబ్బతీయాలో చర్చించారు. ఆ మీటింగ్‌కు సంబంధించిన ఆడియో బయటకు రావడంతో ఆర్‌సీవో విచారణ నిర్వహించారు. కానీ ఇంతవరకూ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం వారికి మెమో కూడా జారీ చేయలేదు. ఓ సామాజికవర్గం టీచర్లు చేస్తున్న అరచకాలను తట్టుకోలేక ఓ పార్ట్‌టైం పీఈటీ రవి బయటకు వెళ్లి పెయింటింగ్‌ వర్క్‌ చేసుకుంటున్నారు. శానిటేషన్‌ సామగ్రి విషయంలో ఆర్‌సీవో అవకతవకలపై ఆర్నెళ్ల క్రితం విజిలెన్స్‌ ఎంక్వైరీ నిర్వహించారు. ఈ ఎంక్వైరీ అనంతరం ఆర్‌సీవోకు షోకాజ్‌నోటీసు ఇచ్చి ఏఆర్‌సీవోను తప్పించి దమ్మపేట అధ్యాపకులుగా డిమోషన్‌ ఇచ్చారు. కానీ ఆర్‌సీవోపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం చర్చనీ యాంశంగా మారింది. ఆర్‌సీవో కార్యాలయ ఉద్యోగులు సైతం మనోవేదనకు గురవుతున్నట్లు సమా చారం. కొందరు ఇక్కడి నుంచి బదిలీ చేయించుకునేందుకు శతవిధాలా ప్రయ త్నిస్తున్నట్లు తెలిసింది. కరోనా సమయంలో కొందరు పిల్లలు దురలవాట్లకు లోనయ్యారు. అటువంటి పిల్లలను గుర్తించి వారానికోసారి కౌన్సెలింగ్‌ చేయాలి. కానీ ఆ ప్రయ త్నమేది జరగటం లేదు. జిల్లాలోని విద్యాసంస్థలను సందర్శి ంచేందుకు ఆర్‌సీవోకు నెలకు రూ.40వేలు ఇస్తుంటారు. కానీ ఆమె ఏ ఒక్క పాఠశాలను సందర్శించిన దాఖలాలు లేవని, కార్యాలయంలోనే ఉంటూ అను'కుల' ఉపాధ్యాయులతో కలిసి అన్నీతానై చక్రం తిప్పుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు : మంత్రి పువ్వాడ
రెండు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ
అంజనీపుత్రునికి వైభవంగా 'ఆకుపూజ'
దేశ రాజకీయాల్లో కేసిఆర్‌ పాత్ర చిత్రీకరణ భేష్‌
కృష్ణవేణి కళాశాల ర్యాంకర్‌ రాజేష్‌ను అభినందించిన మంత్రి
బీజేపీని కర్నాటక ప్రజలు నిర్ణయాత్మకంగా తిరస్కరించారు
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
వీఓఏల పట్ల రేగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
కార్మికోద్యమాన్ని నిర్మించిన మహానేత కామ్రేడ్‌ కె.జార్జ్‌
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి
పారామెడికల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
నేటి నుండి సీఎం కప్‌ క్రీడా పోటీలు
సుదిమల్ల అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలి
వీఓఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బైరి సోనీది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యే....
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన కోసం ప్రోత్సాహాకాలు
ప్రభుత్వం చేపట్టిన క్రమబద్దీకరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి
కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్‌
క్రీడల్లో నైపుణ్యాన్ని సాధించాలి
బీజేపీ పతనం ప్రారంభం
కేంద్రం పాచికలు తిప్పికొట్టిన కర్నాటక ఓటర్లు
ఉపాధ్యాయిని కోడి నాగమణి ఆకస్మిక మృతి
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి
సిబిఎస్‌ఈ ఫలితాలలో న్యూఇరా విద్యాసంస్థల
ఉపాధి పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి : వ్యకాస
సీబీఎస్‌ఈ 12వ తరగతి పబ్లిక్‌ ఫలితాల్లో
రేగాపై విమర్శలు చేస్తే సహించేది లేదు
ఓటరు నమోదు పై వారం వారం సమీక్ష

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.