Authorization
Mon May 05, 2025 04:54:08 pm
నవతెలంగాణ-గుండాల
మండలంలోని చీమలగూడెం గ్రామానికి చెందిన మెడికల్ విద్యార్థిని కల్తి భవానీకి ఎస్ఐ దారం సురేష్ సోమవారం రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ కల్తి భవానీది నిరుపేద కుటుంబం అయినప్పటికీ తను అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ముందుకు పోవడం సంతో షకరమన్నారు. డాక్టర్ కావాలనే భవానీ కల నెరవేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని భవానీ, తల్లిదండ్రులు పాల్గొన్నారు.