Authorization
Wed May 07, 2025 10:24:57 am
నవతెలంగాణ - వైరాటౌన్
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజత వైరా మున్సిపాలిటీ పరిధిలోని బి.సి కాలనీ నందు పలువురికి దుప్పట్లను, బిల్లా జోజి, ముత్తమ్మ దంపతులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐద్వా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత మాట్లాడుతూ ఏసుక్రీస్తు ప్రబోధించిన ప్రేమా, శాంతి మార్గంలో అందరూ పయనించాలని, సేవా మార్గాన్ని అలవరుచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ కాలనీ యూత్ పవన్ జోష్, దిలీప్, బాలరాజు, సుమన్, వంశీ, రాజేశ్, కనకమ్మ, గోవిందమ్మ, అనసూర్య, రత్తమ్మ, సుశీల, శీలమ్మ , సూతకాని శ్రీకాంత్, గుడిమెట్ల. వెంకట రోహాన్ తదితరులు పాల్గొన్నారు