Authorization
Wed May 07, 2025 02:01:32 am
నవతెలంగాణ-మణుగూరు
రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మెన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు పుష్పగిరి కంటి ఆసుపత్రి హైదరాబాద్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగానే కంటి ఆపరేషన్లను చేపిస్తున్న సంగతి నియోజకవర్గ ప్రజలకు తెలిసిందే. నిరంతరం కొనసాగుతున్న ఈ కంటి ఆపరేషన్లు 6వ విడత విజయవంతంగా పూర్తి చేసుకొని 50 మంది పేదలు మణుగూరు చేరుకున్నారు. వారిని స్వయంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి ఆప్యాయంగా పలకరించారు. మీ ఇంట్లో సభ్యుడిగా, మీకు తోడుగా ఉంటానని అన్నారు. అనంతరం వారికి టిఫిన్ సౌకర్యాన్ని ఆయన కల్పించారు. వారిని గమ్యస్థానాలకు చేరే విధంగా చూడాలని స్థానిక నాయకులకు తెలియజేశారు. కంటి ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని కంటి సమస్యతో బాధపడే పేదలు ఎవరైనా ఉంటే పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.