Authorization
Tue May 06, 2025 09:51:32 pm
నవతెలంగాణ - బోనకల్
జ్వర సర్వేను పూర్తిస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సిబ్బందిని కోరారు. మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో జరుగుతున్న ద్వారా సర్వేను ఆదివారం ఆయన పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్న ఆశ కార్యకర్త రత్నకుమారి వీఆర్ఏ రాజేష్ ను సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అక్కడ అక్కడ కొంతమందికి జలుబు, దగ్గు ఉన్నట్లు వారు ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవ దశ కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రజలందరూ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండా లని కోరారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలన, సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ సర్వే కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు పాల్గొన్నారు.