Authorization
Wed May 07, 2025 05:51:25 am
కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే కందాళ
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ పీవీ గౌతమ్‌ను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీతారామ ప్రాజెక్టు భూ సేకరణలో పాలేరు నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. ఖమ్మంరూరల్ మండలానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఖమ్మంలోని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని, వాటిని వరంగల్ రోడ్డులోని తరుణి హాట్కు మార్చాలని కలెక్టర్‌ను కోరారు. నియోజకవర్గంలోని సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. వారితో పాటుగా ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శసురభి ఉన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ బెల్లం ఉమ, కూసుమంచి ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ యడ్లపల్లి వరప్రసాద్, టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు బెల్లం వేణు, డీసీసీబీ డైరక్టర్ ఇంటూరి శేఖర్ తదితరులు ఉన్నారు.