Authorization
Tue May 06, 2025 11:56:20 am
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మండల మున్నూరు కాపు సంఘం ఐక్య కాపు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కూనవరం గ్రామానికి చెందిన ''పద్మశ్రీ'' అవార్డు గ్రహీత ''సకిన రామచంద్రయ్య''ని అభినందించి మణుగూరు మండల మున్నూరు కాపు సంఘం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు వన్నం కృష్ణమోహన్, గాండ్ల సురేష్, ఎడవల్లి వెంకటయ్య, వలసాల వెంకటరామారావు, శ్రీనివాస్, పోట్ల ముత్తయ్య, యువక మండలి అధ్యక్షులు మేడ నాగేశ్వరావు, ఐక్య కాపు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉట్కూరు సత్యనారాయణ, కిషన్, సుంకర భాస్కర్ రావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.