Authorization
Tue May 06, 2025 03:25:01 am
అ పోడు రైతులతో జడ్పీ చైర్మెన్ కోరం
నవతెలంగాణ-ఇల్లందు
పోడు భూముల విషయంలో రైతులు అధైర్య పడవద్దని అండగా ఉంటామని జడ్పీ చైర్మన్ కోసం కనకయ్య అన్నారు. మండలంలోని మొండితోగు, పూసపల్లి గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం జడ్పీ చైర్మెన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లారు. వారు స్పందించారు. సంబంధిత అటవీశాఖ అధికారుల కార్యాలయానికి వెళ్లి రేంజర్ రవికిషోర్, డీఆర్ఓలు సోలోమెన్, రాంసింగ్లతో చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గిరిజనులు దరఖాస్తులు చేసుకున్నారని సమస్య పరిష్కారం అయ్యే వరకు పోడు భూముల జోలికి వెళ్లవద్దని అధికారులను ఆదేశించారు. పంటలు పాడు చేయొద్దని రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణ ప్రసాద్, రాము, మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు తాటి బిక్షం తెరాసా నాయకులు చిల్లా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.