Authorization
Tue May 06, 2025 08:45:19 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్గా దోమల రమేష్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ అప్‌గ్రేడ్ అయిన నాటి నుండి ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న నల్లగట్ల వెంకటేశ్వర్లు ఎస్పీ కార్యాలయంలో పీసీఆర్‌కు బదీలీపై వెళ్తున్నారు. సీఐగా బాధ్యతలు చేపట్టిన దోమల రమేష్ 2009 బ్యాచ్‌కు చెందిన వారు. 2009లో చర్ల ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో 2014లో సీఐ పదోన్నతి పొందారు. అనంతరం భద్రాచలం రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. అక్కడ నుండి ఆయన కారేపల్లి, టేకులపల్లి, ఖమ్మం రూరల్, ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లలో సీఐగా సమర్ధవంతంగా విధులు నిర్వహించారు. డీఐజీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఎస్పీ సునీల్‌దత్ ఆదేశాల మేరకు శుక్రవారం దుమ్ముగూడెం సీఐగా పూర్తి స్థాయి బాధ్యతలు బదీలీపై వెళుతున్న నల్లగట్ల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజల సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేస్తానని అన్నారు. అసాంఘిక వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు పాత్రికేయులతో పాటు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.