Authorization
Wed May 07, 2025 11:49:44 am
నవతెలంగాణ-కారేపల్లి
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ కారేపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్ధార్ కోట రవికుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి ధారావత్ రవి మాట్లాడుతూ ఏడేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆపాలంటే ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నాయకులు సత్య, బన్సీలాల్, వై.రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.