Authorization
Wed May 07, 2025 04:33:42 am
అ ప్రమాదాలు జరుగకుండా ట్రాఫిక్‌ను మళ్ళించాలి
అ తోగ్గూడెం సర్పంచ్ రజిత
మణుగూరు ఈ నెల 16వ తేదీ నుండి 19 వరకు మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరతో పాటు మణుగూరు మండలంలోని తోగ్గూడెంలో జరిగే మీనీ మేడారం జాతరకు భద్రత కల్పించాలని తోగ్గూడెం సర్పంచ్ బొగ్గం రజిత కోరారు. బొగ్గం రజిత, కమిటీ సభ్యులు ఏఎస్పీ శభారీష్కు వినతిపత్రం అందజేశామన్నారు. అనంతరర ఆమె మాట్లాడుతూ తోగ్గూడెం నుండి వయా రైల్వే స్టేషను రహదారి మార్గం గుండా సీఎస్పి వరకు ఉన్నటువంటి రోడ్డు మార్గం ద్వారా భారీ వాహనాలు, బొగ్గు రవాణా చేసే లారీలు, మళ్ళించాలని కోరామన్నారు. దీని కారణంగా ప్రమాదాలు జరుగకుండా ఉంటాయన్నారు.