Authorization
Mon May 05, 2025 06:50:09 am
నవతెలంగాణ-కొణిజర్ల
మండలి పరిధిలోని సింగరాయపాలెం గ్రామానికి చెందిన యువకుడు సురభి వెంకటేశ్వర్లు ఇటీవలే ఆనారోగ్యంతో మృతిచెందాడు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు తల్లిదండ్రులను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పరామర్శించి సానుభూతి తెలిపారు. చిన్న వయసు అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో జెండా పట్టుకొని చురుకుగా పాల్గొనేవాడన్నారు. వెంకటేశ్వర్లు మృతి వారి కుటుంబానికి, పార్టీకి తీరని లోటన్నారు. అనంతరం గ్రామశాఖ కార్యదర్శి మిద్దె రామారావు కాలుకి చిన్న శస్త్రచికిత్స జరగడంతో రామారావుని పరామర్శించారు. కార్యక్ర మంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి క్రిష్ణ దోడ్డపనేని క్రిష్ణార్జున్ రావు, గాదె వెంకటరెడ్డి, రోషన్ బేగ్, ఖాసింబేగ్, తీగల వెంకటీ, షేక్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.