Authorization
Tue May 06, 2025 10:38:58 pm
అ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణా రెడ్డి
నవతెలంగాణ-బూర్గంపాడు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం మండల కేంద్రమైన బూర్గంపాడు మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించారు. ఈ సమావేశంలో గోపిరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల గడపగడపకూ పథకాలు వెళ్లినప్పుడే సంక్షేమ ఫలాలు ప్రజలకు అందడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ సమావేశంలో బూర్గంపాడు, మణుగూరు జడ్పీటీసీలు కామిరెడ్డి శ్రీలత, పోశం నర్సింహారావు, ఏఎంసీ చైర్పర్సన్ ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, కార్యదర్శి జక్కం సుబ్రమణ్యంలతో పాటు గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు,యువజన సంఘాల అధ్యక్షులు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.