Authorization
Tue May 06, 2025 03:28:27 pm
వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్ విజరు చంద్ర
నవతెలంగాణ- నేలకొండపల్లి
రైతులు ఈ ఏడాది సాగుచేసిన పంటల వివరాలను సర్వే నెంబర్ల ఆధారంగా పోర్టల్ లో నమోదు చేయాలని కూసుమంచి వ్యవసాయ సహాయ సంచాలకులు ఏడిఏ ఎస్ జయచంద్ర మండల వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచించారు. బుధవారం మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అం మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఈ ఏడాది రైతులు సాగు చేసిన పంటలు వ్యవసాయ విస్తరణ అధికారులు పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యవసాయ విస్తరణ అధికారులు వారికిచ్చిన టార్గెట్ లకు అనుగుణంగా నిర్మాణాలను రైతులతో కలిసి పూర్తి చేయించాలని అన్నారు. అనంతరం ఏఈఓ లు పోర్టల్ లో నమోదు చేసిన వ్యవసాయ పంటల సాగు వివరాలను ఆయన పరిశీలించారు. ఈ సమీక్ష సమావేశంలో మండల వ్యవసాయాధికారి ఎస్ వి కె నారాయణరావు పాల్గొన్నారు.