Authorization
Wed May 07, 2025 09:16:40 am
నవతెలంగాణ-గాంధీచౌక్
నాబార్డు వారి ఆర్థిక సహకారంతో తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు శిక్షణా సంస్థ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం జిల్లా పరిధిలోగల 75 సంఘాల వైస్ చైర్మన్లు మరియు పాలకవర్గ సభ్యులకు అవగాహనా కార్యక్రమంను డీసీసీ బ్యాంక్లో ఏర్పాటు చేశారు. డీసీసీబీ జిల్లా చైర్మెన్ కురాకుల నాగభూషణం అధ్యక్షత వహించి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో సహకార సంఘాల ముఖ్య ఉద్దేశాలు, సంఘాల యొక్క నిబంధనావళి, పాలకవర్గ సభ్యుల విధులు, బాధ్యతలు, సంఘ కార్యనిర్వహణ అధికారి విధులు, రుణాలు, వసూళ్లు, చట్టపరమైన చర్యల గురించి శిక్షణా కార్యక్రమం నిర్వహించడమైనది. కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య నిర్వహణ అధికారి అట్లూరి వీరబాబు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది, సంఘ ఉపాధ్యక్షులు మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.