Authorization
Tue May 06, 2025 01:40:45 pm
- వ్యకాస జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు
ఖమ్మంరూరల్ : అర్హులైన పేదలం దరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు ప్రభుత్వ డిమాండ్ చేశారు. మండలం లోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్ లో ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం రూరల్ మండల కమిటీ సమావేశం కత్రం ఉపేందర్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వాలని, సొంత స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17న ఖమ్మం రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయం నందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మికులును కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు పొన్నెకంటి సంగయ్య,నండ్ర ప్రసాద్, మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరరావు, లింగంపల్లి వీరస్వామి, మునిగంటి యాదగిరి,జి.నాగయ్య, తమ్మనబోయిన సుధాకర్, పచ్చిపాల నర్సయ్య, చిర్రా లాలూ తదితరులు పాల్గొన్నారు.