Authorization
Tue May 06, 2025 08:59:17 pm
- భద్రాచలం ఐటీడీఏ ఏపీవో (జనరల్) డేవిడ్ రాజ్
భద్రాచలం : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడప బడుతున్న ఆశ్రమ పాఠశాల, గృహాల్లో చదువుతున్న బాల, బాలికలకు చదువు తోపాటు, పౌష్టికాహార అందించుటకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీడీఏ ఏపీవో (జనరల్) డేవిడ్ రాజు అన్నారు. శుక్రవారం ఐటిడిఏ సమావేశ మందిరం లో ఆశ్రమ పాఠశాల మరియు వసతి గృహాల లోని బాల బాలికలకు పౌష్టికాహారం, అలంకరణకు సంబంధించిన జిసిసి ద్వారా నిర్వహించిన వస్తు సామగ్రి డిడి ట్రైబల్ వెల్ఫేర్ రమాదేవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలకు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన ఆహారాన్ని అందించాడనికి కృషి చేస్తామన్నారు. నిత్యావసర వస్తువులు ఈనెల 22 నుంచి మూడు నెలలపాటు, అలంకరణ వస్తువులు ఆరు నెలల పాటు, జిసిసి ద్వారా సంబంధిత ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు క్రమం తప్పకుండా సరఫరా చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంజి సిసి, వాణి, ఏటిడిఓ నరసింహారావు, మేనేజర్ శంకర్, వీరభద్ర స్వామి, పాల్వంచ, నరసింహారావు, మణుగూరు, దామీయ, దమ్మపేట, తదితరులు పాల్గొన్నారు.