Authorization
Tue May 06, 2025 01:30:34 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985-1986 సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా శుక్రవారం పేదలకు ఆర్థిక సహాయం చేశారు. అటెండర్ రాంబాబు, గజ్జి వెంకన్న, చవటి గూడెంకు చెందిన శ్రీనుకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున రూ.15వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థుల ట్రస్టుకు పూర్వపు విద్యార్థి సతీష్ రూ.25వేలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎన్.సత్య ప్రకాష్, నంబూరి వెంకన్న, రాగి వెంకటాచారి, ఐలయ్య, ప్రకాష్, సత్యవతి, రాము తదితరులు పాల్గొన్నారు.