Authorization
Tue May 06, 2025 03:38:55 pm
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి కార్మిక సంఘ నాయకురాలుగా మహిళా ఎన్నికై చరిత్ర సృష్టించింది. కరోనా కారణంగా హెచ్ఎంఎస్ మణుగూరు ఏరియా కార్మిక నేత హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షులు కోడిపల్లి శ్రీనివాస్ మరణించారు. ఇంతవరకు హెచ్ఎంఎస్ నూతన కమిటీ నియమించలేదు. మంగళవారం హెచ్ఎంఎస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రియాజ్ అహ్మద్ నూతన కమిటీని ప్రకటించారు. ఏరియా ఉపాధ్యక్షులుగా కోడిపల్లి శ్రీలత ఎన్నికయ్యారు. బ్రాంచ్ కార్యదర్శిగా అజహార్ ఖాన్, ట్రెజరర్ కే.సతీష్, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.కుమారస్వామి, జాయింట్ కార్యదర్శులుగా బీపీఎన్ కుమార్, కే.రమేష్, డి.విజరు కుమార్, డి.సతీష్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎస్.హరికృష్ణ, వినరు కుమార్లతో ఏరియా కమిటీని ప్రకటించారు. కార్మిక సంఘాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందని కార్మిక సంఘాలు కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.