Authorization
Mon May 05, 2025 11:50:32 pm
- వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల సంఘం అధికారి
నవతెలంగాణ-భద్రాచలం
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటర్ జాబితాలో చోటు కల్పిస్తూ పగడ్బందీగా జాబితా రూపొంది ంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాసరాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఓటర్ జాబితా రూపకల్పన, గరుడ యాప్ వినియోగంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో, ప్రాజెక్టు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఓటర్ల నమోదుకు జనవరి ఒకటో తేదీ మాత్రమే ప్రామాణికంగా తీసుకునే వారని ఈ సంవత్సరం నుంచి జనవరి 1, ఏప్రిల్ ఒకటి, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను సైతం ప్రామాణికంగా తీసు కుంటూ 18 సంవత్స రాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయా లని తెలిపారు. ఆగస్టు 4 నుండి అక్టోబర్ 24, 2022 వరకు ఫ్రీ రివిజన్ నిర్వహించి నవంబర్ 9, 2022న ముసాయిదా జాబితా విడుదల చేయాలని, డిసెంబర్ 8, 2022 వరకు సదరు జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించా లని, రెండు శనివారాలు, ఆదివారాలు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని డిసెంబర్ 26, 2022లోగా అభ్యంతరాలను, ఓటర్ క్లెయిమ్స్‌ను పూర్తిస్థాయిలో పరిష్కరించి, జనవరి 5, 2023న తుది ఓటర్ జాబితా రూపొందించాలని తెలిపారు. ఆగస్టు ఒకటి, 2022 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వద్ద నుంచి ఆధార్ వివరాలు సేకరించాలని, ఆధార్ వివరాలు అందించడం ఐచ్చికం మాత్రమేనని, ఓటర్ల ఆధార్ వివరాలు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతంపోట్రూ, డీటీఆర్‌ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.